: జీవం అక్కడినుండే వచ్చివుంటుందా?


భూమిపైకి జీవరాశి అంతరిక్షం నుండే వచ్చి వుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు... అసలు భూమిపై లేనటువంటి ఒకరకమైన లోహం అంతరిక్షంలోనే ఉందని, ఉల్కద్వారా భూమిపైకి చేరిన ఒక లోహం నుండి భూమిపై జీవరాశి ఆవిర్భవించిందని ఇటీవలే శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా గత ఏడాది అంతరిక్షం నుండి భూమిపైకి వచ్చి పడిన రాయిలో జీవపదార్ధం ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అరిజోనా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సాండ్రా పిజారె గత ఏడాది అంతరిక్షం నుండి కాలిఫోర్నియాలో వచ్చిపడిన రాయిపై పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనల్లో ఈ రాయిలో జీవపదార్ధం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయం గురించి పిజారె మాట్లాడుతూ, ఈ అంతరిక్ష రాయిపై పరిశీలన చేపట్టాలని, ఇందులోని జీవపదార్ధం గతంలో ఏ అంతరిక్ష రాయిలోనూ గుర్తించలేదని అన్నారు. ఇది భూమి ప్రాథమిక దశలోని పరమాణువులకు సంబంధించిన ముఖ్యమైన ఆవిష్కారమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News