: ఐఎస్ఐది నీచమైన బుద్ధి!


పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) ది ఎంత నీచమైన వ్యవహారశైలో మరోసారి తేటతెల్లమైంది. భారత్ లోని ఉగ్రవాద మూకలకు ఆర్ధికదన్ను అందిస్తోంది ఐఎస్ఐనే అంటూ భారత్ అంతర్జాతీయ సమాజం ముందు ఎన్నోసార్లు ఎలుగెత్తింది. తాజాగా భారత్ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టయింది. ఇటీవలే అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ పలు విషయాలు వెల్లడించాడు. తమకు ఆర్దిక సాయం అందిస్తోంది ఐఎస్ఐనే అని భత్కల్ విచారణలో బయటపెట్టాడు. ఐఎస్ఐ కనుసన్నల్లోనే తామంతా నడుచుకునేవాళ్ళమని తెలిపాడు. కాగా, యాసిన్ తో పాటు ఇండియన్ ముజాహిదిన్ స్థాపనలో కీలకపాత్ర పోషించిన అతడి సోదరులు రియాజ్, ఇక్బాల్ లు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. వారు అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News