: ప్రధాని ఓ కీలుబొమ్మ: తలసాని
ప్రధాని మన్మోహన్ ఓ కీలు బొమ్మలా మారారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. సీఎం కిరణ్ 45 రోజులుగా పరిపాలన మానేసి నాలుగు గోడల మధ్య గడుపుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో సుస్థిర పాలన కోసం ప్రజలు చంద్రబాబు వైపు చూస్తున్నారని ఆయన అన్నారు.