: లైబీరియా అధ్యక్షురాలికి 'ఇందిరాగాంధీ శాంతి పురస్కారం'
లైబీరియా అధ్యక్షురాలు ఎల్లెన్ జాన్సన్ సెర్లిఫ్ కు దివంగత ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాజ్ భవన్ లో బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, లోక్ సభ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొన్నారు. అమెరికా నుంచి తిరిగివచ్చాక సోనియా ప్రజలకు దర్శనమివ్వడం ఇదే తొలిసారి.