: పోలీసులపై హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్
ఏపీఎన్జీవోల సభ సందర్భంగా పోలీసుల వైఖరిపై పలువురు టీఆర్ఎస్ నేతలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. సభ వద్ద నిరసన తెలిపిన నిజాం కాలేజీ హాస్టల్ విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు హెచ్చార్సీని కోరారు. దీనిపై స్పందించిన హెచ్చార్సీ... జరిగిన ఘటనపై ఈ నెల 24లోగా నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్ కి ఆదేశాలు జారీ చేసింది.