: లీటర్ కు రూ. 1.50 తగ్గనున్న పెట్రోలు ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో పెట్రోలు ధరలు రూ. 1.50 వరకు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ విషయాన్ని భారత ఇంధన శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ సూచనప్రాయంగా తెలిపారు. ఇది వాస్తవరూపం దాలిస్తే వచ్చే వారం ధర తగ్గనుంది. అయితే డీజిల్, వంట గ్యాస్ ధరలు మాత్రం పెరగక తప్పదని రాయ్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీ ఉత్పాదక మండలి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రభుత్వంపై సబ్సిడీలు పెనుభారం మోపుతున్నాయని... ప్రభుత్వం కానీ, చమురు సంస్థలు కానీ వీటిని భరించే పరిస్థితిలో లేవని ఆయన అన్నారు. గత రెండు నెలల్లో బలహీనపడిన రూపాయి వల్ల దిగుమతుల భారం పెరిగి... సబ్సిడీ బిల్లు రూ.20వేల కోట్లకు చేరుకుందని తెలిపారు.