: కేంద్ర హోంశాఖ అధికారులను కలిసిన శైలజానాథ్, పాలడుగు
ఢిల్లీలో ఉన్న మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు కేంద్ర హోంశాఖ అధికారులను కలిశారు. వీరితోపాటు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు కూడా ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనంటూ శైలజానాథ్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు వారిని కలిసినట్లు తెలుస్తోంది.