: హెరిటేజ్ మా పాలవ్యాపారుల పొట్టగొట్టింది: కోదండరాం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ పై తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విరుచుకుపడ్డారు. పాలు, పాల ఉత్పత్తుల విపణిలోకి హెరిటేజ్ రంగప్రవేశంతో తెలంగాణలో పాలవ్యాపారులు దారుణంగా నష్టపోయారని ఆరోపించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే కొద్దిమంది దోపిడీదార్లకే నష్టమని, అందుకే వారు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. 10 శాతం మంది ఉన్న వారే హైదరాబాదు తమదంటుంటే.. 90 శాతం మంది ఉన్న తామేమనాలని కోదండరాం ప్రశ్నించారు.