: తెలంగాణ విషయంలో హైదరాబాదే పెద్ద చిక్కుముడి!


మరో 20 రోజుల్లో తెలంగాణ నోట్ కేంద్ర హోంశాఖ నుంచి న్యాయశాఖ వద్దకు చేరుతుందని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఇతర మంత్రులు కొన్ని రోజుల కిందట వెల్లడించిన సంగతి తెలిసిందే. మరింతవరకు దానికి సంబంధించి ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం నోట్ హోంశాఖ వద్దే కదలకుండా ఉందని, న్యాయశాఖకు వెళ్లడం కష్టమేనని తెలుస్తోంది. ఇందుకు అసలు కారణం హైదరాబాద్ పైనే చిక్కుముడి ఏర్పడిందని సమాచారం. అయితే, హైదరాబాద్ పై రాజకీయ నిర్ణయమే కీలకమని, తర్వాతే విధాన నిర్ణయమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం దానిపైనే రాజకీయ చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం.

సోనియా కూడా అమెరికా నుంచి తిరిగివచ్చారు కాబట్టి పలువురు పార్టీ ముఖ్యనేతలు, అవసరమైతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆ తర్వాతే నోట్ న్యాయశాఖకు వెళుతుందంటున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలపైబడి తెలంగాణ సమస్యపై కొనసాగుతున్న డిమాండును ఒక్క రోజులోనే (జులై 30వ తేదీన) తేల్చేసిన సోనియా, 45 రోజుల తర్వాత కూడా అలానే చకచకా తేల్చేస్తారని ఓ వినికిడి.

  • Loading...

More Telugu News