: 'అల్లు రామలింగయ్య అవార్డు' ప్రత్యేకమైంది: కోట శ్రీనివాసరావు
'అల్లు రామలింగయ్య అవార్డు' తనకెంతో ప్రత్యేకమైనదని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తెలిపారు. ఈ అవార్డుకు ఆ మహానటుడి పేరు ఉండటమే దానికి కారణమని తెలిపారు. తనకెన్నో ప్రభుత్వ అవార్డులు వచ్చినప్పటికీ... అల్లు రామలింగయ్య పేరిట నెలకొల్పిన ఈ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. 2013 సంవత్సరానికి గాను ఈ నెల 30న కోట ఈ అవార్డు అందుకోనున్నారు. పోయినేడాది ఈ అవార్డును తనికెళ్ల భరణి అందుకున్నారు. 300లకు పైగా చిత్రాల్లో నటించిన కోట... ఇప్పటిదాకా 6 నంది అవార్డులు, 1 ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు