: పాక్ బోర్డుపై కన్నెర్ర చేసిన షోయబ్ అఖ్తర్


పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ కన్నెర్ర చేశాడు. పీసీబీ వైఖరిపై ధ్వజమెత్తి దుమ్ముదులిపేశాడు. క్రికెట్ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు బీసీసీఐతో అంటకాగొద్దని హితవు పలికాడు. ఛాంపియన్స్ లీగ్ టీట్వంటీలో పాల్గొనేందుకు ఫైసలాబాద్ జట్టు కు వీసాను భారత్ నిరాకరించడంపై అఖ్తర్ పాక్ బోర్డుపై విరుచుకుపడ్డాడు. జాతీయ జట్టును మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించాడు. ఛాంపియన్స్ లీగ్ అయినా, ఐపీఎల్ అయినా మరే విషయంలోనైనా భారత్ ను అడుక్కోవద్దని సూచించానని ఘాటుగా స్పందించాడు. ఇరుదేశాల మధ్య సాధారణ పరిస్థితులు బాగాలేనప్పుడు పాక్ కు భారత్ ఎలా మద్దతిస్తుందని పాక్ ప్రభుత్వాన్ని షోయబ్ అఖ్తర్ ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News