: వార్షికాదాయం రూ. 6 లక్షల కంటే తక్కువా.. కార్ లోన్ కష్టమే
లోనుపై కారు కొనుక్కోవాలనుకునే ఉద్యోగస్తులకు చేదు వార్త. ఇకపై సంవత్సరాదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉంటే కారు లోన్ ఇవ్వమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో తక్కవ జీతం వచ్చే ఉద్యోగుల కారు కల... కలలానే మిగిలిపోనుంది. లోన్ ఎగవేతదారుల సంఖ్య పెరుగుతుండటంతో... ఈ సమస్యను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. దీనికి తోడు ఉద్యోగుల ఆదాయంలో పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది.
గతంలో కార్ లోన్ పొందడానికి రూ. 2.5 లక్షల సంవత్సరాదాయం ఉంటే సరిపోయేది. అయితే తన అకౌంట్ హోల్డర్లకు మాత్రం ఎస్‌బీఐ కొంత సడలింపునిచ్చింది. వీరి సంవత్సరాదాయం రూ. 4.5 లక్షలుంటే సరిపోతుందని తెలిపింది. ప్రస్తుతం కారు లోన్లపై 10.45 శాతం వడ్డీని వసూలు చేస్తోంది ఎస్‌బీఐ. రానున్న రోజుల్లో మిగిలిన బ్యాంకులు కూడా ఎస్‌బీఐ దార్లో ప్రయాణించే అవకాశం ఉంది.