: రెండు రోజుల్లో బాబు, టీడీపీ నేతల ఢిల్లీ టూర్
టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ పార్లమెంటు సభ్యులు, ముఖ్యనేతలతో కలిసి రెండు రోజుల్లో ఢిల్లీ టూర్ వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, కేంద్ర మంత్రులను, ముఖ్య నేతలను కలవనున్నారు. సీమాంధ్రలో ఆందోళనలు, రాష్ట్ర పరిస్థితిపై బాబు వారికి వివరించనున్నారని తెలుస్తోంది. నెలరోజులు దాటినా రాష్ట్రంలో ఉద్యమాలు, ఆందోళనలపై ఏం పట్టించుకోకుండా ఉండటంపై కూడా బాబు అడగనున్నారు. త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పనున్నారు.