: సోనియా, ప్రధాని మాస్కులు ధరించి నిరసన
48వ రోజుకు చేరుకున్న సమైక్యాంధ్ర నిరసనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తాజాగా నర్సీపట్నంలో సమైక్యవాదులు వినూత్నంగా నిరసనలు తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాస్కులు ధరించి రోడ్లపై భజనలు చేస్తూ, పాటలు పాడుతూ నిరసన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.