: సీమాంధ్రలో వీధి దీపాలు ఉండవ్: మున్సిపల్ జేఏసీ


సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోంది. అన్ని రంగాల కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఇతరులు ఉద్యమంలో మమేకమవుతున్నారు. తాజాగా మున్సిపల్ జేఏసీ వీధిదీపాలు వెలిగించమని తెలిపింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని అన్ని పట్టణాల్లో వీధి దీపాలు బంద్ చేయనున్నట్టు తెలిపారు. ఉద్యమానికి సహకరించని నేతల ఇళ్లకు విద్యుత్, త్రాగునీరు, పారిశుద్ధ్యపనులు నిలిపివేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 17న తిరుపతిలో మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News