: 72 గంటల విద్యుత్ సమ్మె.. అలముకోనున్న అంధకారం
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె నిర్ణయాన్ని సడలించారు. 72 గంటలపాటు సమ్మెకు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు వారీ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేలు, ఆసుపత్రులు, త్రాగు నీరు వంటి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. నేటి అర్థరాత్రి నుంచి 72 గంటలపాటు ఈ సమ్మె కొనసాగనుంది. దీంతో సీమాంధ్ర మొత్తం అంధకారం అలముకోనుంది.