: ఆంధ్రా ఇంజినీరు పైడిరాజును విడుదల చేసిన తీవ్రవాదులు
అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీరు పైడిరాజును విడుదల చేశారు. విశాఖపట్నానికి చెందిన పైడిరాజును అసోంలోని బోడో తీవ్రవాదులు శనివారం నాడు అపహరించిన సంగతి తెలిసిందే. పవర్ గ్రిడ్ కార్పోరేషన్లో పైడిరాజు ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.
దిగువ అసోంలోని బాక్సా జిల్లాలో పనిచేస్తున్న ఈయనను అపహరించుకుపోయారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున ఆయన కోసం గాలింపు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆయనను తీవ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు.