: పదకొండో శతాబ్దం నాటి శాసనాలు లభ్యం


చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం దేవులచెరువు పంచాయతీ పత్తికోట సమీపంలో పదకొండో శతాబ్దం నాటి తెలుగు, తమిళ శాసనాలు లభ్యమయ్యాయి. చెరువు ఒడ్డున లభ్యమైన ఓ ఆరు అడుగుల బండపై ఇరువైపులా రెండు భాగాలుగా తమిళంలో శాసనం చెక్కి ఉంది. ఈ శాసనంపై సూర్యవంశానికి చెందిన చోళరాజుల సూర్యుని చిహ్నం చెక్కి ఉంది. అక్కడికి సమీపంలోని మరో బండపై తెలుగు శాసనం చెక్కి ఉంది. పురావస్తుశాఖాధికారులు ఈ శాసనాలను పరిశీలించి వివరాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News