: మా సమ్మె ప్రజల కోసమే: సీమాంధ్ర విద్యుత్ జేఏసీ
రాష్ట్ర విభజన జరిగితే జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడతాయని, అందుకే తాము సమ్మె బాట పడుతున్నామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. తమ సమ్మె ప్రజల కోసమే అని స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్, జూరాల విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తయ్యే జల విద్యుత్ లో 75 శాతం తెలంగాణకే కేటాయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు జల విద్యుత్ లభించదని, థర్మల్ విద్యుత్తే దిక్కని జేఏసీ నేతలన్నారు. థర్మల్ విద్యుత్ యూనిట్ విలువ ప్రస్తుతం రూ.4 ఉండగా.. విభజన జరిగితే అది రూ.7 అవుతుందని వారు వివరించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడం కష్టమవుతుందన్నారు.