: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బాబు ఆగ్రహం
కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సమైక్య నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 'అసలు తెలంగాణకు బీజం వేసింది మీ దివంగత నాయకుడు వైఎస్సే' అని విమర్శించారు. నాయకుడు జైల్లో ఉన్నా మీకు సిగ్గులేదని... పిచ్చి వేషాలు వేయకండని హెచ్చరించారు.