: సమాజ్ వాదీ ఆగ్రా సమావేశానికి అజం ఖాన్ గైర్హాజరు


ఆగ్రాలో జరుగుతున్న రెండు రోజుల సమాజ్ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పార్టీ ప్రముఖ నేత అజం ఖాన్ గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి 106 మంది సభ్యులు వచ్చారు. ఈ భేటీకి ఎవరో కొందరు రానందున వచ్చిన నష్టమేంటి? అని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ మీడియాను ప్రశ్నించారు. ముజఫర్ నగర్ హింసను ఎదుర్కోవడంలో పార్టీ వైఫల్యం, ములాయం సింగ్ వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్ ను కలవడం వంటి కారణాలపై కినుక వహించిన అజం ఖాన్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ సమావేశాలు ఈ రోజు, రేపు జరుగనున్నాయి.

  • Loading...

More Telugu News