: సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ నిరసనలు
హైదరాబాదులో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు తెలిపారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యుత్ సౌధ, పంచాయతీ రాజ్ కార్యాలయాల వద్ద వేర్వేరుగా ఈ నిరసనలు కొనసాగాయి. విద్యుత్ సౌధలో తెలంగాణ ఉద్యోగులు ధర్నా చేయగా సీమాంధ్రులు మానవహారం నిర్వహించారు. పంచాయతీరాజ్ వద్ద సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించి నినాదాలు చేశారు.