: లోకేష్ చవటబ్బాయి.. బాబు వ్యాఖ్యలకు శ్రీకాంత్ రెడ్డి రిటార్ట్
ఆత్మగౌరవ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాహుల్, జగన్ లపై చేస్తున్న వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రిటార్టిచ్చారు. రాహుల్ మొద్దబ్బాయి, జగన్ దొంగబ్బాయి.. అంటూ టీడీపీ అధినేత విరుచుకుపడుతుండడంతో ఆయన చంద్రబాబు తనయుడు లోకేష్ చవటబ్బాయని వ్యాఖ్యానించారు. జగన్ కి వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదన్న కసితోనే చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. లోకేష్ లీలల గురించి ఎమ్యెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడికి బాగా తెలుసని, బాబు గోబెల్స్ ప్రచారం ఆపకపోతే లోకేష్ లీలలు బయటపెట్టాల్సి ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. బాబు చేసిది ఆత్మ గౌరవ యాత్రకాదని వైఎస్సార్సీపీపై విష ప్రచార యాత్ర అని అన్నారు.