: తిరుపతిలో స్టేడియం నిర్మాణానికి పచ్చజెండా
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి మరో కొత్త శోభను సంతరించుకోనుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన 30 ఎకరాల భూమిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఆమోదం లభించింది.
30 ఏళ్ల పాటు ఈ స్థలాన్ని బీసీసీఐ తరపున ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు ఇచ్చేందుకు ఎస్వీయూ పాలక మండలి నిర్ణయించిందని రాష్ట్ర ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా వెల్లడించారు.
30 ఏళ్ల పాటు ఈ స్థలాన్ని బీసీసీఐ తరపున ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు ఇచ్చేందుకు ఎస్వీయూ పాలక మండలి నిర్ణయించిందని రాష్ట్ర ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా వెల్లడించారు.