: బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి ఆశారాం నో


పదిహేనేళ్ళ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు దర్యాప్తునకు సహకరించడంలేదు. రక్త పరీక్షల కోసం ఢిల్లీ ఎండీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా రక్తం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. నార్కో పరీక్షలు జరుపుతున్నారా? అంటూ ఆశారాం ప్రశ్నించారు. మరోవైపు ఆశారాంకు నార్కో పరీక్షలు జరపాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. స్వామి నిజంగా అమాయకుడే అయితే ఆయనకు పాలీగ్రాఫ్, బ్రెయిన్ మాపింగ్ పరీక్షలు చేయడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆశారాం మద్దతుదారులను ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News