: అఫ్జల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించండి: ప్రధానికి కాశ్మీర్ సీఎం లేఖ


పార్లమెంట్ పై దాడి కేసులో ఉరితీయబడ్డ ఉగ్రవాది అఫ్జల్ గురు భౌతిక కాయాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరుతూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ కు లేఖ రాశారు.

కాశ్మీర్ ప్రతిపక్ష నేత, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత ముఫ్తీ సయీద్ కూడా కాశ్మీర్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెంచేలా ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. 

ఫిబ్రవరి 9వ తేదీన అఫ్జల్ గురును తీహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. అనంతరం అతని భౌతిక కాయాన్ని అధికారులు జైలులోనే ఖననం చేశారు. అఫ్జల్ మృతదేహాన్ని అప్పగించాలన్న అతని కుటుంబ సభ్యుల అభ్యర్థనను తిరస్కరించిన ప్రభుత్వం..ప్రార్థనలు చేసుకునేందుకు వారిని జైలుకు అనుమతిస్తామంది.

  • Loading...

More Telugu News