: జగన్ ప్రపంచ రికార్డు: యనమల
అవినీతి, కుంభకోణాలు, చార్జీషీట్ల విషయంలో జగన్ ప్రపంచరికార్డు సృష్టించాడని టీడీపీ సీనియర్ నేత యనమల రామ కృష్ణుడు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో యనమల, కిమిడి కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. జగన్ పై దాఖలైనన్ని చార్జిషీట్లు మరే రాజకీయ నాయకుడిపైనా దాఖలైన చరిత్ర లేదన్నారు. దోపిడీ విధానం, మోసం చేయడమే లక్ష్యంగా పనిచేసే వైఎస్సార్సీపీ పేదలకు ఏ రకమైన సామాజిక న్యాయం చేస్తుందని వారు ప్రశ్నించారు.