: మోడీ ప్రధాని అభ్యర్ధిత్వంపై అద్వానీతో రాజ్ నాథ్ భేటీ
ఎప్పటినుంచో నానుతున్న నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిత్వంపై బీజేపీ కొద్దిరోజుల్లో ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీతో ఢిల్లీలో కొద్దిసేపటి కిందట ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఒత్తిడి తెస్తోన్న సంగతి తెలిసిందే. మోడీ అభ్యర్థిత్వంపై పార్టీలో అద్వానీ, సుష్మస్వరాజ్ మినహా దాదాపు అందరూ సరే అంటున్నారు. రెండు మూడు రోజుల్లో మోడీపై పార్టీ అధినాయకత్వం ప్రకటన కూడా చేయనుంది.
దాంతో, అద్వానీని ఒప్పించేందుకు రాజ్ నాథ్ భేటీ అయ్యారు. పార్టీలో అద్వానీ సీనియర్ నాయకుడు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, ప్రధాని పదవిపై ఆశ కూడా ఉన్న నేత. అలాంటప్పుడు మోడీకి ఓకే చెప్పాలంటే కొంచెం కష్టమే. కానీ, మోడీకి ఉన్నంత పాప్యులారిటీ అద్వానీకి లేకపోవడం, ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో ఇలా చేయక తప్పడంలేదన్నది బహిరంగ సత్యం.