: పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి


పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజెర్ల మండలం పుల్లలపాడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ సంఘటన ఈ రోజు ఉదయం జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. సింగరాజుపాలెంకు చెందిన వీరందరూ ద్వారకా తిరుమలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News