: ప్రధాని నివాసంలో యూపీఏ పెద్దల సమావేశం
ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో యూపీఏ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంలతో పాటు అజిత్ సింగ్, ఫరూఖ్ అబ్ధుల్లా, టీఆర్ బాలు వంటి సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్, ఉగ్రవాదం వంటి అంశాలతో పాటు తెలంగాణ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.