: కూతుర్ని చెరిచిన కామాంధుడు
సమాజంలో జరుగుతున్న సంఘటనలు సగటు జీవికి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. విలువలు నేర్పాల్సిన వారే విలువల్ని వదిలేస్తున్నారు. వీధిలో కాదు స్వంత ఇంట్లోనే మహిళకు రక్షణ లేకుండాపోతోందన్న సంగతి ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. రక్షించాల్సిన తండ్రే భక్షిస్తే.. అండగా నిలవాల్సిన వారు పసి గుండెల్ని చిదిమేస్తే అంతకంటే దారుణం, దుర్మార్గం ఇంకోటి ఉండదు. సభ్యసమాజం తలెత్తుకోలేని ఘటన బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలోని భోజ్ పూర్ జిల్లాలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం కన్నతండ్రే ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ కామాంధుడి నుంచి రక్షించమని తన సవతి తల్లిని అర్థించినా ఆమె కనికరం చూపలేదని ఆ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆరా జిల్లా ఆసుపత్రికి తరలించారు.