: విలువల్లేని ఉద్యమం అది: హరీశ్ రావు
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఉద్యమంలో మానవీయ విలువలు లేవని విమర్శించారు. సమ్మె పేరుతో పెత్తందారులు లాభపడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెతో ప్రైవేటు ట్రావెల్స్, పేదలకు వైద్యం అందించే పీహెచ్ సీల బంద్ తో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయని దుయ్యబట్టారు. కలిసుందామంటూ సీమాంధ్రులు విడిపోయే పనులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ గన్ మెన్ ను వెనక్కిపంపుతున్న సీమాంధ్ర నేతలు తెలంగాణ పోలీసులను అవమానపరిచారని మండిపడ్డారు.