: అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి కొత్త అధ్యక్షుడు


ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడిగా జాక్వస్ రొగే శకం ముగిసింది. ఆయన స్థానంలో జర్మనీకి చెందిన థామస్ బాచ్ ఐఓసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లో జరిగిన ఐఓసీ సభ్యదేశాల సమావేశంలో అధ్యక్ష స్థానానికి ఓటింగ్ నిర్వహించగా.. అత్యధికులు బాచ్ కే మద్దతు పలికారు. బాచ్ ఐఓసీ ఉపాధ్యక్షుడిగా మూడు పర్యాయాలు వ్యవహరించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఈ జర్మన్ జాతీయుడు 1976 ఒలింపిక్స్ లో ఫెన్సింగ్ అంశంలో స్వర్ణం గెలిచాడు.

  • Loading...

More Telugu News