: ములాయంపై విరుచుకుపడిన బీజేపీ
తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ కు ములాయం సింగ్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీజేపీ మండిపడింది. ముజఫర్ నగర్ లో 40 మంది మరణించిన తర్వాత కూడా క్లీన్ చిట్ ఎలా ఇస్తారని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహుదూర్ పాఠక్ ప్రశ్నించారు. అల్లర్లను మత ఘర్షణలుగా ములాయం వర్ణించడాన్ని ఆయన తప్పుపట్టారు. రెండు దశాబ్దాల క్రితం రాష్టాన్ని అట్టుడికించిన సంఘటనలు అఖిలేష్ హయాంలో పునరావృతం అయ్యాయని అన్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని విజయ్ తెలిపారు