: ఓ ఇంటివాడైన 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్


'బాయ్స్' సినిమాతో తెరంగేట్రం చేసి 'ప్రేమిస్తే' మూవీతో తెలుగులోనూ ప్రజాదరణ సొంతం చేసుకున్న యువ హీరో భరత్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యుల అనుమతితో ప్రేయసి జెస్సీ చేయందుకున్నాడు. మంగళవారం ఉదయం చెన్నైలోని గిండీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం జరిగింది. భరత్ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా.. జెస్సీ క్రిస్టియన్. దుబాయ్ లో డెంటిస్ట్ గా ఉన్న జెస్సీ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా భరత్ కు పరిచయమైంది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమ రూపుదాల్చింది. పెద్దలు అంగీకరించడంతో వీరి వివాహానికి ఎలాంటి ఆటంకాలు కలగలేదు. కాగా, ఈ నెల 14న చెన్నైలో వీరి వివాహ రిసెప్షన్ ఉంటుంది.

  • Loading...

More Telugu News