: అనంత, కడప జిల్లాల్లో భారీ వర్షం


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అనంతపురం జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. హిందూపురంలో పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. ధర్మవరంలో ఒక రైతు వాగులో చిక్కుకున్నట్టు సమాచారం. కడప జిల్లా ముద్దనూరు మండలంలో వాగు దాటుతున్న 8 మంది వరద నీటిలో చిక్కుకున్నారు. ప్రొద్దుటూరులో నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు 21.5 సెం.మీ వర్షపాతం నమోదయింది. దీంతో పట్టణం మొత్తం జలమయమయింది. ప్రొద్దుటూరు - రాజుపాలెం రహదారిపై వరద నీరు చేరుకోవడంతో... రాకపోకలు నిలిచిపోయాయి. బద్వేలులోని ఆర్టీసీ గ్యారేజిలోకి వరద నీరు ప్రవేశించింది.

రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతోందని తెలిపింది.

  • Loading...

More Telugu News