: ఢిల్లీ చేరుకున్న సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీ చేరుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం గతవారం అమెరికా వెళ్లారు. అంతకుముందు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్ సభలో చర్చ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా సోనియా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో, వెంటనే ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు.