: కొందరినే దోమలు కుడతాయి... ఎందుకంటే...


మనలో కొందరిని మాత్రమే దోమలు కుడతాయి. కొందరిని తక్కువగా కుడతాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే దోమలు ఇలా కొందరిని మాత్రమే వాటి టార్గెట్‌గా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారా... సదరు వ్యక్తుల శరీరం నుండి వెలువడే చెమట వాసనే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరి శరీరం నుండి వెలువడే చెమట దోమలను విపరీతంగా ఆకర్షిస్తుండగా, మరికొందరి శరీరం నుండి వెలువడే చెమట వాటిని విపరీతమైన గందరగోళానికి గురిచేస్తుందట. దీంతో సదరు వ్యక్తుల జోలికి ఇవి తక్కువగా వెళతాయని పరిశోధకులు చెబుతున్నారు.

మనిషి శరీరం నుండి వెలువడే చెమటలో కొన్ని రసాయనాలు దోమల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. దోమలు చెమట వాసన ద్వారా మనిషిని గుర్తిస్తాయి. సాధారణంగా దోమలనుండి కాపాడుకోవడానికి మనం చాలావాటిని ఉపయోగిస్తుంటాం. అయితే కొందరికి వీటి వాసన ఇష్టం ఉండదు. ఇలాంటి వారికోసం దోమలు వాసన పీల్చకుండా నిరోధించగలిగే రకరకాల పదార్ధాలతో రిఫెల్లెంట్లను తయారు చేయడానికి ప్రయత్నాలుచేస్తున్నట్టు, దోమ తన ఆహారాన్ని గుర్తించకుండా చేయగలిగితే దోమ కాటునుండి తప్పించుకోవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న అమెరికా వ్యవసాయ విభాగం పరిశోధకులు ఉల్రిచ్‌ బెర్నియర్‌ చెబుతున్నారు. కొందరినే దోమలు విపరీతంగా కుట్టడానికి కారణం వారి చర్మంపై ఉండే వందల రసాయనాల నుండి వెలువడే వ్యక్తిగతమైన వాసన దోమల్ని బాగా ఆకర్షిస్తుందని పరిశోధకులు గుర్తించారు. మనిషి చెమటలో ఉండే లాక్టిక్‌ ఆమ్లం 90 శాతం దాకా దోమల్ని ఆకర్షిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మరికొన్ని రసాయనాలు దోమల్ని విపరీతమైన గందరగోళానికి గురిచేస్తున్నట్టు కూడా వీరు చెబుతున్నారు. మెథిల్‌ పైపెర్జైన్‌ సమూహానికి చెందిన రసాయనాలు దోమల్ని వాసన పట్టకుండా నిలువరిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దోమలు ఇలా కొంతమందివైపే ఎక్కువగా ఆకర్షించబడడానికి, మరికొంతమందివైపు వెళ్లకపోవడానికి కారణం 'మెథిల్‌ పైపెర్జైన్‌' సమూహానికి చెందిన రసాయనాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News