: ఇది భూగర్భం గురించి చెబుతుంది


భూగర్భంలో ఎక్కడ ఏం ఉంది? అనే విషయం తెలుసుకోవడం కష్టం. అయితే ఈ సరికొత్త పరికరంతో భూగర్భంలో దాగివున్న చమురు, సహజ వాయువుల నిల్వలను చక్కగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి లోపల చమురు, సహజవాయువులు ఎంత లోతులో, ఏమేరకు ఉన్నాయో తెలియజేసే ఒక సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు తయారుచేశారు. దీంతో చమురు నిల్వలను గురించి చక్కగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని తయారుచేశారు. ఈ పరికరం భూమిలోపల నిబిడీకృతమై ఉండే చమురు, సహజవాయువుల సమీకృత నిల్వలు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాన్ని కచ్చితంగా తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు భూగర్భంలో చమురు ఎక్కడ తయారవుతుంది... అక్కడినుండి సేకరించే ప్రాంతానికి ఎలా ప్రయాణిస్తుంది? అనే విషయాలను అర్ధంచేసుకోవడంలో ఈ పరికరం ఒక సరికొత్త సూచీగా కూడా నిలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరికరం చమురు వనరులను కనుగొనడంతోబాటు నిల్వల సేకరణలో ఎదురయ్యే పర్యావరణ సమస్యలను కూడా తగ్గిస్తుందని ఈ పరిశోధనలో పాల్గొన్న భూవిజ్ఞాన శాస్త్ర ఆచార్యుడు క్వింగ్‌ ఝు ఇన్‌ చెబుతున్నారు. తర్వాత పరిశోధనలో తాము కనుగొన్న పరికరాన్ని చమురు లీకేజీల కాలుష్య కారకాలను గుర్తించడంలో వినియోగించవచ్చని కూడా ఆయన తెలిపారు. ఈ కొత్త పరికరాన్ని మంగోలియా, కెనడాల్లో పరీక్షించి చూసినట్టు క్వింగ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News