: 'బుకర్ ప్రైజ్' రేసులో ఝంపా లహిరి
ప్రవాస భారత రచయిత్రి ఝంపా లహిరి రాసిన 'ద లోల్యాండ్' అనే పుస్తకం ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ లోకి చేరింది. 1960లలో కోల్ కతా నేపథ్యంలో సాగే ఇద్దరు అన్నదమ్ముల కథే ఈ పుస్తకం. పశ్చిమ బెంగాల్ నుంచి బ్రిటన్ వలస వెళ్లిన కుటుంబంలో లండన్ లో జన్మించిన ఝంపా లహిరి ప్రస్తుతం న్యూయార్క్ లో నివసిస్తున్నారు. ఆమె రాసిన 'ఇంటర్ ప్రెటర్ ఆఫ్ మెలడీస్' కథానికల సంపుటికి 2000లో పులిట్జర్ బహుమతి లభించింది. ఝంపా లహిరి తొలి నవల 'ద నేమ్ సేక్' ని మీరానాయర్ అదే పేరుతో తెరకెక్కించారు.