: మార్కెట్ లోకి హుందాయ్ గ్రాండ్ 'ఐ10' కొత్తకారు
ఆటోమొబైల్ రంగంలో ద్వితీయ శ్రేణిలో ఉన్న హుందాయ్ సంస్థ కొత్త మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని పేరును 'గ్రాండ్ ఐ10' గా నిర్ణయించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ఈ 'ఐ10' కారును లాంఛనంగా ఆవిష్కరించారు. కొత్త కారు డీజిల్, పెట్రోలు రెండు రకాలుగా లభ్యమవుతుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఎన్ సియో అన్నారు. మంచి మైలేజీ, నాణ్యత గల ఈ కారు యువతను బాగా ఆకర్షిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.