: రాహుల్ ముందుండి నడిపిస్తాడు: సచిన్ పైలెట్
వచ్చే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మొన్న, సాక్షాత్తూ ప్రధానే తనకు రాహుల్ నాయకత్వంలో పనిచేసేందుకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించగా.. నేడు కేంద్ర మంత్రి సచిన్ పైలెట్ కూడా అదే రీతిలో అభిప్రాయం వెలిబుచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో రాహుల్ పార్టీని నడిపిస్తారని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో యూపీఏ గెలిస్తే, అప్పుడు ప్రధాని అయ్యేదెవరో మీరే చూస్తారంటూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కాగా, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా మన్మోహన్ పేరును పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ పర్యాయం కూడా ప్రధాని అభ్యర్థిని ముందే ప్రకటిస్తారా? అన్న ప్రశ్నకు సచిన్ పైలెట్ జవాబిస్తూ, వేచి చూడండన్నారు.