: ప్రయాణీకుల భద్రతే ముఖ్యం: కోట్ల
రైళ్లలో ప్రయాణీకుల భద్రత, ముఖ్యంగా మహిళల రక్షణకే తమ తొలి ప్రాధాన్యమని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి మొత్తం 24 రైళ్లు మంజూరు కాగా, వీటిలో 12 రైళ్లు రాష్ట్రం నుంచి మొదలవనుండగా..మరో 12 రైళ్లు రాష్ట్రం మీదుగా వెళతాయని కోట్ల తెలిపారు.
విజయవాడలో ఏర్పాటు చేయనున్న బాట్లింగ్ పరిశ్రమను రైల్వేకు చెందిన స్థలంలోనే ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. కర్నూల్ లో 110 కోట్ల రూపాయలతో 125 ఎకరాల్లో సువిశాలంగా రైల్వే వర్క్ షాపు నిర్మించనున్నట్లు కోట్ల వివరించారు. ప్రయాణీకులపై భారం తగ్గించేందుకే రిజర్వేషన్ ఛార్జీల్లో మార్పులు చేసినట్లు కోట్ల తెలిపారు.