: భత్కల్ కస్టడీ పొడిగింపు
ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అక్తర్ ల కస్టడీని పొడిగించారు. ఢిల్లీ కోర్టు వీరిద్దరికీ ఎన్ఐఏ కస్టడీని ఈ నెల 17 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అంతకుముందు, వీరిద్దరి 12 రోజుల కస్టడీ ముగియడంతో ఎన్ఐఏ ఈరోజు కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో.. వీరిద్దరూ పలు పేలుళ్లకు కుట్ర పన్నారని, భారత్ లో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి తెలిపింది.