: రెండు ప్రాంతాలకు వేర్వేరు శాఖలు : కిషన్ రెడ్డి
తెలంగాణపై బీజేపీది ఒకటే మాట అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు పార్టీలు ద్వంద్వ విధానాలు పాటిస్తూ... రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణపై కేబినెట్ నోట్ కు ఆమోదం లభించిన తర్వాత... రెండు ప్రాంతాలకు రెండు శాఖలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ఇరు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఏ పార్టీకి మంచిది కాదని ఆయన అన్నారు.