: 'నిర్భయ' కేసులో దోషులకు ఉరిశిక్ష పడుతుంది: షిండే
దేశంలో సంచలనం సృష్టించిన 'నిర్భయ' అత్యాచారం కేసులో దోషులకు తప్పకుండా ఉరిశిక్ష పడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. మహిళల రక్షణకోసం చట్టం తెచ్చిన నేపథ్యంలో వారికి కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నామన్నారు. కేసును త్వరితగతిన విచారించిన ఢిల్లీ పోలీసులను అభినందించాలని షిండే అన్నారు.