: రేపటితో ముగియనున్న చంద్రబాబు బస్సుయాత్ర తొలి షెడ్యూల్
'తెలుగు జాతి ఆత్మగౌరవం' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన బస్సుయాత్ర మొదటి షెడ్యూల్ రేపటితో ముగియనుంది. రేపు తిరువూరు పర్యటన అనంతరం బాబు హైదరాబాద్ కు చేరుకుంటారు. వారం రోజుల అనంతరం రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 1న యాత్ర చేపట్టిన బాబు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో పర్యటించారు.