: ఉన్న పార్టీకే ఠికాణా లేదు.. కొత్త పార్టీ పెడతారట: బాబు
ఉన్న పార్టీకే ఠికాణా లేదు కానీ, కాంగ్రెస్ నేతలు కొత్త పార్టీ పెడతామంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాలో తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర గంపలగూడెం చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్ ఆఫీసులుగా మారిపోయాయని విమర్శించారు. ఒకే కుటుంబం చేసిన లక్ష కోట్ల దోపిడీ వల్ల తెలుగు జాతి మొత్తాన్ని దొంగలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబం నుంచి ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.