: తిరుమలకు బస్సులు తిప్పలేం.. ఇది జేఏసీ నిర్ణయం


రెండు రోజుల పాటు తిరుమలకు బస్ లు నిలిపివేయాలని చిత్తూరు జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ తీసుకున్న నిర్ణయం టీటీడీ అధికారులకు షాకిచ్చింది. దీంతో టీటీడీ యాజమాన్యం తరపున టీటీడీ అధికారుల సంఘం నాయకులు.. చిత్తూరు జిల్లా జేఏసీ నాయకులను కలసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోలేమని.. ఇది ఆర్టీసీతో పాటు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులంతా కలసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా టీటీడీ అధికారుల సంఘం కూడా సంఘీభావం తెలపాలని కోరారు. దీంతో చేసేది ఏమీలేక టీటీడీ అధికారులు వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News