: సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆగిన మరో గుండె
సమైక్యాంధ్ర ఉద్యమంలో మరో గుండె ఆగింది. నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు భక్తా శంకర్ యాదవ్ (51) ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా రిలే నిరాహారదీక్ష చేస్తున్న ఆయన 'జై సమైక్యాంధ్ర' నినాదాలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. తోటి ఉపాధ్యాయులు ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈయన నాయుడుపేటలోని జెడ్పీ హైస్కూల్ లో సైన్సు టీచర్ గా పనిచేస్తున్నారు. ఈయనకి ఇద్దరు పిల్లలున్నారు. శంకర్ యాదవ్ మృతి పట్ల సమైక్యవాదులు సంతాపం తెలిపారు.